: 77 ఏళ్ల క్రితం మిస్సయిన విమానం కథాకమామిషు


అమీలియా ఇయర్ హార్ట్... మలేసియా విమానం దొరకకుండా పోవడంతో తాజాగా ప్రముఖంగా వినపడుతున్న పేరిది. అమెరికా దేశానికి చెందిన అమీలియా తొలి తరం మహిళా పైలట్. ఈమె పైలట్ గా ఎన్నో రికార్డులు కైవసం చేసుకుంది. రచయితగా కూడా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. విమానయాన రంగంలో పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కులుండాలని పోరాడిన ఉద్యమకర్త.

ఆ రోజుల్లో అమీలియా అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. 77 ఏళ్ల క్రితం లాక్ హీడ్ మోడల్ 10 ఎలెక్ట్రా విమానంలో ప్రపంచాన్ని చుట్టిరావడానికి బయల్దేరిన అమీలియా ఫసిఫిక్ మహాసముద్రంలోని హోవార్డ్ ద్వీపం వరకు సజావుగా సాగిపోయింది. హోవార్డ్ ద్వీపానికి చేరువలో ఆమె విమానానికి గ్రౌండ్ టవర్ తో సంబంధాలు తెగిపోయాయి. తరువాత ఆమె ఏమైందో... ఆమె విమానం ఎక్కడికి వెళ్లిపోయిందో ఎవరికీ తెలియలేదు. ఇప్పటికీ అది మిస్టరీగానే మిగిలింది.

1937 జూలై 6 న ఆమె చివరి మెసేజ్ పంపింది. ఆమె కోసం మూడు మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి ఆరు నెలలపాటు అమెరికా శోధించింది. కానీ ఆమె జాడ మాత్రం కనిపెట్టలేకపోయింది. అమె చనిపోయి ఉంటుందని కొందరు వాదిస్తే, ఆమె గూఢచారి అనీ, అందుకే అమెరికాకు చిక్కకుండా ఉండేందుకే అలా నాటకమాడిందని, ఎక్కడో అజ్ఞాతవాసంలో ఉంటుందని మరికొందరు వాదించారు. మలేసియా విమానం మిస్సవ్వడంతో ఆమె మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది.

  • Loading...

More Telugu News