: గెస్ట్ హౌస్ లో మహిళా కానిస్టేబుల్ శవం!


ఢిల్లీలోని ఓ గెస్ట్ హౌస్ లో ప్రియాంక కుమారి అనే మహిళా కానిస్టేబుల్ శవమై పడి ఉంది. సోమవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియాంక మరణంతో సంబంధం ఉందన్న అనుమానంపై ఆమె కాబోయే భర్త మోహిత్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాంక మృతదేహం వెలుగుచూసినప్పటి నుంచి మోహిత్ పరారీలో ఉన్నాడు. నేడు హర్యానాలోని తన స్వగ్రామంలో ఉండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ప్రియాంక తన భార్య అని చెప్పి సాగర్ పూర్ ప్రాంతంలోని గెస్ట్ హౌస్ లో ఆదివారం మకాం వేశాడని, అనంతరం అదే రోజు సాయంత్రం ఒంటరిగా బయటకు వెళ్ళిపోయాడని పోలీసులు తెలిపారు. తర్వాతి రోజు ఉదయం గెస్ట్ హౌస్ మేనేజర్ రూం తలుపు తట్టినా ఎవరూ స్పందించకపోవడంతో, సిబ్బంది సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. అక్కడ ప్రియాంక బెడ్ పై విగతజీవురాలై పడి ఉంది. దీంతో, అతను పోలీసులకు సమాచారమందించాడు.

ఇంతకుముందు నేవీలో పని చేసిన మోహిత్ కు ప్రియాంకకు ఏడాది క్రితం నిశ్చితార్థమైంది. అయితే, మోహిత్ కు చెడు వ్యసనాలు ఉన్నాయన్న కారణంతో ప్రియాంక కుటుంబ సభ్యులు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఈ కారణాలతోనే అతడు ప్రియాంకను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News