: విద్యుత్ అంశంపై సర్కారుని నిలదీసిన హరీష్ రావు


విద్యుత్ సమస్య మీద శాసనసభలో జరిగిన చర్చకు సీఎం ఇచ్చిన సమాధానంతో విపక్షాలు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఈ అంశంపై అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విద్యుత్తును అందరికంటే తక్కువ ధరకే కొన్నామని ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఆయన విభేదించారు.

రాష్ట్రంలోని ఎన్ టీ పీసీ మూడు వేల ఐదు వందలకే టన్ను బొగ్గు కొనుగోలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం టన్ను బొగ్గు ఐదు వేలకు కొనుగోలు చేసిందని హరీష్ రావు ఆరోపించారు. పబ్లిక్ డొమైన్ లోని నివేదికల ఆధారంగానే తాను ఈ లెక్కులు చూపిస్తున్నానని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి 5 ప్రభుత్వ రంగ సంస్థ లకు మాత్రమే అనుమతి ఇవ్వడం ద్వారా భారీ అవినీతి జరుగుతుందని హరీష్ రావు సభ దృష్టికి తెచ్చారు.

కరెంట్ లేక నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం 7 గంటలైనా విద్యుత్ ఇచ్చి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

  • Loading...

More Telugu News