: సర్కారుకి ముందు చూపు లేకే ఈ ఉపద్రవం: పయ్యావుల
ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో 31వేల కోట్ల రూపాయల భారం ప్రజలమీద పడిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. జనవరి నుంచి విద్యుత్ ఉపద్రవం రాబోతోందని ఏడాది క్రితమే జైన్ తన నివేదికలో చూపినా, ప్రభుత్వం మిన్నకుందని ఆయన విమర్శించారు. విద్యుత్ అంశంపై ముఖ్యమంత్రి సమాధానానికి ప్రతిగా పయ్యావుల ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ప్రసంగానికి ముఖ్యమంత్రి అభ్యంతరం చెబుతూ, 31 వేల కోట్ల భారం వేశామని ఎలా చెబుతున్నారో చూపించండంటూ ఎదురు ప్రశ్న వేశారు.