: శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్
ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ ఈ రోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.