: పవన్ పై శంకర్రావు ఆగ్రహం
నటుడు పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి శంకర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ గాలి మాటలు మాట్లాడుతున్నారని, రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. మూడు పెళ్లిళ్లు చేసుకుని ఎంతోమంది జీవితాలను పవన్ నాశనం చేశారని విమర్శించారు. అటు మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైన వ్యాఖ్యానించిన శంకర్రావు, సొంత పార్టీ పెట్టుకుని తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నారన్నారు.