: టీడీపీలోకి శైలజానాథ్... కిరణ్ కు షాక్


మాజీ మంత్రి శైలజానాథ్ సైకిలెక్కడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్ ను జేఎస్పీ ఉపాధ్యక్షుడిగా ఇప్పటికే కిరణ్ ప్రకటించారు. అయితే, శైలజానాథ్ మాత్రం జేఎస్పీతో సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. తెలుగు ప్రజల అభివృద్ధికి కృషి చేసే పార్టీలోనే చేరతానని స్పష్టం చేశారు. తన వెంట ఉన్న కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి రేపు (గురువారం) తుది నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గంలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో... శైలజానాథ్ టీడీపీలోకి చేరడం లాంఛనమే అని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీతో అన్ని చర్చలు పూర్తయ్యాయని... సైకిలెక్కడమే మిగిలి ఉందని సమాచారం. ఇదే నిజమైతే, జేఎస్పీ అధినేత కిరణ్ కు షాక్ తగిలినట్టే. ఎందుకంటే, మొదట్నుంచి కూడా కిరణ్ కు శైలజానాథ్ అత్యంత సన్నిహితుడు.

  • Loading...

More Telugu News