: రాష్ట్రవ్యాప్తంగా 38 కోట్ల రూపాయలు స్వాధీనం: భన్వర్ లాల్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 38 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు. ఆయన ఈరోజు (మంగళవారం) హైదరాబాదులో మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అవసరాల కోసం నగదును తరలించేవారు... అందుకు కచ్చితమైన ఆధారాలు చూపాలని ఆయన స్పష్టం చేశారు. తనిఖీల కోసం 1,911 ఫ్లయింగ్ స్వ్కాడ్ లు పనిచేస్తుండగా, 899 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న సొమ్మును పట్టుకుంటే 1950 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలని భన్వర్ లాల్ సూచించారు.