: నేను మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తా: కేంద్ర మంత్రి సర్వే
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగానే పోటీ చేస్తానని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చెప్పారు. అంతేగాని, తాను అసెంబ్లీకి పోటీ చేసేది లేదని ఆయన తేల్చి చెప్పారు. తాను రాహుల్ గాంధీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయాలనుకుంటున్నానని సర్వే పేర్కొన్నారు.
మాజీ మంత్రి దానం నాగేందర్ పై సర్వే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో వేలు పెట్టడానికి దానం ఎవరని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుకు ఇప్పటికీ అవకాశం ఉందని ఆయన చెప్పారు.