: ఆ ట్వీట్లు నేను చేయలేదు: వీణా


ట్విట్టర్లో తాను భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు వచ్చిన వార్తలపై పాక్ నటి వీణా మాలిక్ స్పందించింది. ఆ ట్వీట్లు ఎవరో ఫేక్ అకౌంట్ ద్వారా చేశారని వివరణ ఇచ్చింది. తన మాజీ స్నేహితుల్లో ఒకరు ఆ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిందీ శృంగార తార. ఇటీవల భారత్ లో జర్మన్ టూరిస్టుపై అత్యాచార యత్నం జరగగానే, వీణా ట్విట్టర్ అకౌంట్ నుంచి భారత వ్యతిరేక కామెంట్లు వచ్చాయి. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. బిగ్ బాస్ రియాలిటీ షోలో వీణా, అస్మిత్ పటేల్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

కాగా,ఇటీవలే దుబాయ్ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఈ పాక్ సుందరి ఇకపై తన పేరు వీణా మాలిక్ కాదని, వీణా ఖాన్ ఖటక్ అని పేర్కొంది. ఇకపై తన ట్విట్టర్ ఐడీ @iVeenaMalik కాదని @iVeenaKhan అని వివరించింది.

  • Loading...

More Telugu News