: అసెంబ్లీలో విద్యుత్ చర్చపై సీఎం సమాధానం


గత 25 ఏళ్లలో కాలంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గుదల నమోదవడమే ప్రస్తుత విద్యుత్ సమస్యకు కారణమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విద్యుత్ సమస్య మీద నిన్న, ఇవాళ శాసనసభలో విస్తృత చర్చ జరిగిన నేపధ్యంలో ఆయన సభకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అధికంగా గ్యాస్ ద్వారానే జరిగిందని సీఎం తెలిపారు. 

నీటితో జరిగే విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ లేకపోవడంతో ఎక్కువ నష్టం వచ్చిందని సీఎం చెప్పారు. కీలక ఉత్పత్తి మార్గమైన గ్యాస్ ద్వారా కూడా ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడంతో వ్యయాలు పెరిగాయన్నారు. ఎంత ఎక్కువ ఉత్పత్తి చేయగలిగితే అంతగా ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉందని సీఎం చెప్పారు. సమస్యను అధిగమించేందుకు విపక్షాలు తగిన సూచనలివ్వాలని సీఎం కోరారు. 

  • Loading...

More Telugu News