: టీఆర్ఎస్ లో చేరిన కొండా దంపతులు
మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కొండా దంపతుల చేరిక సందర్భంగా వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ, పదవుల కోసమో, మరో ప్రయోజనం కోసమో టీఆర్ఎస్ తో తాము చేరలేదని, తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలనే టీఆర్ఎస్ లో చేరామని తెలిపారు. తెలంగాణ వస్తుందని, సాధించి తీరుతామని విశ్వసించిన వ్యక్తి కేసీఆర్ అని ఆమె కొనియాడారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఇప్పుడెలా ఉందో అప్పుడు కూడా అలానే ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలని ఆమె కోరారు.