: గంటా కుమారుడికి బెయిల్
టీడీపీ నేత గంటా శ్రీనివాస్ కుమారుడు రవితేజ, అతని స్నేహితుడు ఇంద్రజిత్ కు బెయిల్ మంజూరయింది. రూ.10వేల పూచీకత్తుతో రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మద్యం తాగి వీరంగం సృష్టించిన కేసులో వారిద్దరినీ నిన్న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.