: భారత్ అందరిదీ, ఎవరు ఎక్కడైనా బతకవచ్చు: రాహుల్


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హపోలి వద్ద కాంగ్రెస్ మద్దతుదారులతో మాట్లాడుతూ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వలస జీవులపై దాడులు పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వెలిబుచ్చారు. భారత్ అందరిదీ అని ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడైనా బ్రతికే హక్కు ప్రతి మతం, కులం, వర్గానికి ఉందని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ కుర్రాడు నిడో తానియం ఢిల్లీలో హత్యకు గురికావడాన్ని ఆయన ఖండించారు. ఉత్తరాది వారిపై మహారాష్ట్రలో, ఈశాన్య రాష్ట్రాల వారిపై ఢిల్లీలో దాడులు ప్రతిపక్షాల విధానమని ఆరోపించారు.

  • Loading...

More Telugu News