: ఆప్ లోక్ సభ అభ్యర్థుల 7వ జాబితా విడుదల
సార్వత్రిక ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ దేశ వ్యాప్తంగా సిద్ధమవుతోంది. తాజాగా పది మంది లోక్ సభ అభ్యర్థులతో ఏడవ జాబితా విడుదల చేసింది. గత నెలలో పార్టీలో చేరిన అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమకారుడు ఎస్పీ ఉదయ్ కుమార్ కన్యాకుమారి నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ జాబితాతో ఆప్ నుంచి మొత్తం 268 అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు.