: అమెరికాలో ఆప్ వెబ్ సైట్ ప్రారంభం


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మరింత ప్రజాదరణ పొందేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు విభిన్నమైన ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను యూఎస్ చాఫ్టర్ ప్రారంభించింది. ఈ మేరకు అమెరికాలో ఏఏపీ తరపున వాలంటీర్ గా వ్యవహరిస్తున్న రవి శర్మ మాట్లాడుతూ, ప్రజల నుంచి మద్దతు పొందేందుకు సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. పలువురి పరిచయాల ద్వారా వారి స్నేహితులు, బంధువులు కూడా తమకు మద్దతు తెలిపేందుకు 'my.aamaadmiparty.Org' వెబ్ సైట్ ను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సైట్ ను స్వచ్ఛంధంగా సిలికాన్ వ్యాలీ నుంచి కొంతమంది అభివృద్ధి చేశారు.

  • Loading...

More Telugu News