: ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరెస్ట్
సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే అతన్ని నాంపల్లి కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే, ట్రాఫిక్ జామ్ అవుతోంది... రోడ్డుపై హోలీ ఆడరాదంటూ సూచించిన కానిస్టేబుల్ వంశీపై అరవింద్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వ్యవహారంపై అరవింద్ పై కేసు నమోదు చేశారు. తప్పించుకు తిరుగుతున్న అరవింద్ ను పట్టుకోవడానికి పోలీసులు రెండు టీంలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, అరవింద్ యాదవ్ తో పాటు మరో ముగ్గుర్ని హుస్సేనీ ఆలం (దక్షిణ మండలం) పోలీసులు అరెస్ట్ చేశారు.