: గాంధీనగర్ నుంచి లోక్ సభ బరిలో అద్వానీ


లోక్ సభ ఎన్నికలకు బీజేపీ నేతలు పోటీచేసే ప్రాంతాలు కొద్దికొద్దిగా ఖరారవుతున్నాయి. తాజాగా ఆ పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారని ఆ రాష్ట్ర పార్టీ యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ రుపాణీ మాట్లాడుతూ, గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అద్వానీ పోటీ చేసేందుకు రాష్ట్ర యూనిట్ ఆమోదించిందని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ కార్యాలయానికి తమ సిఫార్సులను పంపుతామని చెప్పారు. కాగా, నరేంద్రమోడీ గుజరాత్ నుంచి కూడా పోటీ చేస్తారన్నారు.

  • Loading...

More Telugu News