: ఈ బాలీవుడ్ నటుడు హిందీ సినిమాలే చూడడట!
ఆయన పేరు రజత్ కపూర్. బాలీవుడ్ లో దర్శకనటుడిగా పేరుగాంచారు. మిథ్య, మిక్స్ డ్ డబుల్స్ చిత్రాలతో డైరక్టర్ గానూ, ఫస్ గయేరే ఒబామా, భేజా ఫ్రై, మాన్సూన్ వెడ్డింగ్, దిల్ చాహతా హై సినిమాలతో నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ చిత్రాల సరళిపై మాట్లాడుతూ, తానసలు హిందీ సినిమాలే చూడనని చెప్పారు. ఒకవేళ చూసిన తర్వాత మనసంతా శూన్యమే తప్ప ఏమీ ఉండదని తెలిపారు.
95 శాతం సినిమాలు కళా విహీనమని, మిగతా ఐదు శాతంలో 0.5 శాతం మాత్రమే మంచి సినిమాలని అభిప్రాయపడ్డారు. అయితే, నచ్చిన రీతిలో సినిమాలు నిర్మించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని కపూర్ పేర్కొన్నారు. ఇక, యావత్ భారతీయ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే, బెంగాలీ చిత్రాల కంటే మరాఠీ సినిమాలే ఆసక్తికరంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.