: ఓటేసే ముందు వైయస్ ను గుర్తుచేసుకోండి: షర్మిల
రైతులకు మేలు చేసేందుకు తన తండ్రి వైయస్ నిరంతరం శ్రమించేవారని వైఎస్సార్సీపీ నేత షర్మిల అన్నారు. రాష్ట్రాన్ని వైయస్ కన్న తండ్రిలా పాలించారని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చారని కొనియాడారు. గొప్పలు చెప్పుకోవడంతో చంద్రబాబుకు ఎవరూ సాటిరారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఆయన సంక్షేమ పథకాల పల్లవి అందుకున్నారని ఆరోపించారు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా... ఓటు వేసేముందు వైయస్ ను గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు.