: సైన్స్ ప్రాధాన్యంపై హైదరాబాదులో జాతీయ సదస్సు
ఈ నెల 29,30 తేదీల్లో హైదరాబాదులోని తమ కార్యాలయంలో సైన్స్ ప్రాధాన్యంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్
సీహెచ్ మోహనరావు తెలి పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, సీసీఎంబీ కలిసి ఈ
సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించనున్నారని తెలియజేశారు.
మానవ జీవితంలో సైన్స్ ప్రాధాన్యంపై పలువురు నిపుణులు సదస్సులో చర్చించి పలు సూచనలు చేస్తారని పేర్కొన్నారు. ఎన్నో పరిశోధనలకు అవకాశం ఉండే సైన్స్ చదవుపట్ల విద్యార్ధుల్లో ఆసక్తి తగ్గిపోతోందని డైరెక్టర్ మోహనరావు ఆవేదన వ్యక్తం చేశారు.