: అవసరమైనప్పుడు రాజకీయాలు మాట్లాడతా: మోహన్ బాబు
అవసరమైనప్పుడు రాజకీయాలు మాట్లాడతానని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తెలిపారు. కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ, తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం సముచితం కాదని, తాను మాట్లాడనని అన్నారు. సినిమాల గురించి మాట్లాడతానని చెప్పిన ఆయన, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తాను, విష్ణు నటించిన రౌడీ సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుందని, అందులో తన నటన బాగుందో, తన కుమారుడు విష్ణు నటన బాగుందో అభిమానులే తేల్చాలని ఆయన అన్నారు.