: చర్లపల్లి జైలుకు మాజీ మంత్రి కుమారుడు
టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, అతని స్నేహితుడు ఇంద్రజిత్ లను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. వీరిద్దరూ మద్యం సేవించి శంషాబాద్ విమానాశ్రయం దగ్గర్లో అల్లరి చేసిన సంగతి తెలిసింది. దీంతో గత రాత్రి వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. జైలుకు తరలించేందుకు సమయం మించిపోవడంతో వారిని శంషాబాద్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచిన పోలీసులు, ఈ ఉదయం వారిద్దరినీ చర్లపల్లి జైలుకు తరలించారు.