: గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం జూనియర్ డాక్టర్ల పడిగాపులు
గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ కోసం జూనియర్ డాక్టర్లు ఎదురు చూస్తున్నారు. ఏపీ మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ జూడాలు ఆందోళనకు దిగిన విషయం విదితమే. ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తేవాలని ఆయన అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే అపాయింట్ మెంట్ ఇంకా ఖరారు కాకపోవడంతో రాజ్ భవన్ వద్ద జూడాలు పడిగాపులు పడుతున్నారు.