: సముద్రంలో యాక్సిడెంట్
ఇరుకైన రోడ్ల మీద అతి వేగం కారణంగా యాక్సిడెంట్లు సాధరణమే. కానీ విశాలమైన సముద్రంలో యాక్సిడెంట్ చోటుచేసుకుంది. జపాన్ రాజధాని టోక్యో తీర ప్రాంతంలో రెండు కార్గో నౌకలు ఢీ కొట్టుకున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పనామాకు చెందిన బిగెల్ 3, దక్షిణ కొరియాకు చెందిన పెగాసస్ ప్రైమ్ నౌకలు ఒకదానిని మరొకటి ఢీ కొంది. దీంతో అందులో పని చేస్తున్న సిబ్బందిలో ఎనిమిది మంది చైనీయులు గల్లంతవగా, ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గల్లంతైన వారి కోసం రెండు హెలికాప్టర్లు, 19 నౌకలు గాలింపు చేపట్టాయి.