: భారత్ డిప్యూటీ హై కమిషనర్ కు పాక్ సమన్లు
నాలుగు రోజుల కిందట (మార్చి 15) పదమూడు మంది పాకిస్థాన్ మత్స్యకారులను అరెస్టు చేసిన వ్యవహారంలో ఇస్లామాబాద్ లోని భారత డిప్యూటీ హై కమిషనర్ గోపాల్ బగ్లేకు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ సమన్లు పంపింది. తక్షణమే తమ మత్స్యకారులను విడుదల చేయాలని, పడవలను తిప్పి పంపాలని తెలిపింది. మత్స్యకారులను అరెస్టు చేసినప్పుడు ఖజర్ క్రీక్ వద్ద పాక్ జలాల్లోనే వారు ఉన్నట్లు ఆ దేశ మత్స్యకారుల సహకార సొసైటీ ఓ ప్రకటనలో పేర్కొంది.