: భర్తలకు బడితె పూజ... ఇదో హోలీ ఆచారం!


ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం నడుస్తుంటుంది. భర్తకు వాతలు పడేలా భార్య బడితె పూజ చేయడం మన రాష్ట్రంలోని ఓ గిరిజన సంప్రదాయం. హోలీని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సౌమ్యాతండాలో డూండ్ వేడుక జరిగింది. ఇందులో విశేషం ఏంటంటే, భర్తలకు వాతలు పడేలా భార్యలు కొట్టడం. ఇదే ఈ డూండ్ పండుగ ఆచారం.

గతేడాది హోలీకి, ఈ ఏడాది హోలీకి మధ్య తండాలో జన్మించిన మగపిల్లలను తెల్లవారుజామున 4 గంటలకు గెరినీ (భార్యలు)లు దాచిపెడతారు. తెల్లవారాక గేర్యా(భర్త)లు కర్రలు చేతబట్టి పిల్లలను వెతుకుతారు. గేర్యాకు పిల్లవాడు దొరకగానే గెరినీలు కామదహనం చేసి ఇంటిదగ్గర గుంజ (స్థూపం)కు పిల్లాడ్ని కట్టేస్తారు. అక్కడ పిల్లాడి చుట్టూ తినుబండారాలు గంగాళాల్లో ఉంచి కర్రలు చేతబట్టి గెరనీలు కాపలా ఉంటారు. ఆ తినుబండారాలను తీసుకెళ్లడం గేర్యాల పని.

ఇక్కడే గెరినీలు గేర్యాలను ఇరగదీస్తారు. ఈ సమయంలో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపిస్తుంది. ఆ తినుబండారాల గంగాళాలు ఎవరు ఎత్తుకొస్తారో వారిని ధీరుడిగా గుర్తిస్తారు తండా వాసులు. తండా వాసులతో ధీరుడు అనిపించుకోవడానికి అక్కడి మగాళ్లంతా వాతలు తేలిపోయేలా భార్యల చేతుల్లో దెబ్బలు తింటారు.

  • Loading...

More Telugu News