: పిడిగుద్దులతో హోలీ పండుగ


హోలీ పండుగ ఎలా చేసుకుంటారు? అని అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. రంగులతో సందడి చేసుకునే సంగతి కూడా తెలియదా? అంటూ వెర్రోడిని చూసినట్లు చూస్తారు. అలా చూసే వారిని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సాకి వెళ్లి చూడమనండి. అక్కడ ఏటా హోలీ పండుగ రోజున గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకుంటారు. గాయాలైన వారు కాముడి దహనం తర్వాత మిగిలిన బూడిదను వంటికి రాసుకుంటారు. ఇలా చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని వారి నమ్మకం. 400 ఏళ్లుగా ఈ గ్రామంలో దీన్ని పాటిస్తున్నారు. నిన్న కూడా గ్రామంలో పెద్ద సందడిగా పిడిగుద్దుల కార్యక్రమం జరిగింది.

  • Loading...

More Telugu News