: ప్లాట్ ఫారమ్ పైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ


రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫారంపై ఓ మహిళ ప్రసవించింది. మల్కాజిగిరికి చెందిన మాధవి లోకల్ రైలులో ప్రసవం కోసం ఆసుపత్రికి బయలుదేరారు. మేడ్చల్ లో రైలు దిగి పట్టాలు దాటుతుండగా ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. అయితే మూగదైన మాధవి తన ప్రసవ వేదనను బయటకు చెప్పలేకపోవడంతో స్టేషన్ ప్లాట్ ఫారమ్ పైనే బిడ్డకు జన్మనిచ్చింది. రైల్వే సిబ్బంది 108కి ఫోన్ చేయడంతో, తల్లీ బిడ్డను 108 వాహనంలో మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News