: పోలీసుల్ని రాళ్లతో కొట్టిన గ్రామస్థులు


తమ సంప్రదాయాలను గౌరవించని వ్యక్తిని బంధించగా, అతనిని విడిపించేందుకు వచ్చిన పోలీసులపై గ్రామస్థులు తిరగబడి దాడికి దిగిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం బాతోనిబాయి తండాలో తమ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేసి బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలతో తండాకు చేరుకున్నారు. బంధించిన వ్యక్తిని విడిపించేందుకు ప్రయత్నించగా, ఆగ్రహించిన గ్రామస్థులు రాళ్లతో పోలీసులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఏఎస్సై శేషుబాబు, హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్ రెడ్డి, మరో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులకు గాయాలయ్యాయి. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News