: నామమాత్ర రుసుముతో చిన్నారులకు వేసవి శిక్షణ
క్రీడలపై ఆసక్తి గల హైదరాబాదులోని చిన్నారులకు శుభవార్త. ఈ వేసవిలో బాలబాలికలకు వివిధ క్రీడాంశాలలో శిక్షణ నిచ్చేందుకు శావ్ సంస్థ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 1నుంచి 45 రోజుల పాటు ఈ శిక్షణా శిబిరాలు నిర్వహించనుంది. తద్వారా నామమాత్రపు రుసుముతో శిక్షణ తీసుకునే అవకాశం చిన్నారులకు కలుగుతుంది.
తొలిసారిగా జలక్రీడలను ఈ జాబితాలో చేర్చి రెండునెలల పాటు శిక్షణ ఇవ్వబోతున్నారు. దీంతోపాటు చెస్, ఫెన్సింగ్, సెయిలింగ్, రోయింగ్, వుషూ, సాప్ట్ బాల్ క్రీడలను ఈ ఏడాదే చేర్చారు. వీటితోపాటు స్వీయ శిక్షణ, దేహదారుఢ్యం పైనా శావ్ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతోంది.
జంటనగరాల్లోని ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి, జింఖానా గ్రౌండ్స్, యూసఫ్ గూడ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, హుస్సేన్ సాగర్ లలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.