: టీడీపీ సీఎం అభ్యర్థి ఆర్.కృష్ణయ్య?
తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థిగా బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యను ప్రకటించనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో సీఎం పదవి బీసీకే అని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో బీసీ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండటం వల్ల... ఈ వ్యూహంతో తెలంగాణ ప్రాంతంలో మరింత దూకుడును పెంచవచ్చనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆర్.కృష్ణయ్య టీడీపీలో చేరలేదు. త్వరలోనే ఆయనకు పసుపు కండువా కప్పి... సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం.