: పాకిస్తాన్ ఉత్కంఠ విజయం


బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సమరంలో భాగంగా నేడు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పై నెగ్గింది. మిర్పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేసింది. అనంతరం పాక్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ జట్టులో కమ్రాన్ అక్మల్ (52), మహ్మద్ హఫీజ్ (55) అర్ధసెంచరీలతో రాణించారు. వార్మప్ మ్యాచ్ అయినా ఈ పోరు కడదాకా ఉత్కంఠభరితంగా సాగడం విశేషం.

  • Loading...

More Telugu News