: తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు హైకమాండ్: హరీష్ రావు


కాంగ్రెస్ కు ఢిల్లీ, టీడీపీకి సీమాంధ్ర హైకమాండ్ అయితే, టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ కు అస్థిత్వముందని, అది ఎక్కడినుంచో పుట్టింది కాదని, తెలంగాణ ప్రజల హృదయాల్లో నుంచి వచ్చిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను విలీనం చేయాలన్నా, కొనసాగించాలన్నా హైకమాండ్ అయిన తెలంగాణ ప్రజల అభిప్రాయం ముఖ్యమని చెప్పారు. ప్రజలు ఏ అభిప్రాయం చెబితే అదే చేస్తామన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల నవ నిర్మాణానికి టీఆర్ఎస్ పుట్టిందని హరీష్ చెప్పుకొచ్చారు. అంతేకాని పార్టీని కాంగ్రెస్ లో కలపమనడానికి కాంగ్రెస్ నేతలెవరని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే పార్టీ టీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News