: రోశయ్య కు బెల్లంతో తులాభారం
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం విలక్షణరీతిలో సన్మానించింది. ఆయనకు బెల్లంతో తులాభారం నిర్వహించింది. పాలకొల్లులో ఈ రోజు జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ, పొట్టి శ్రీరాములు వంటి మహోన్నత వ్యక్తులతో తనకు పోలిక పెట్టవద్దని ఆర్యవైశ్య నాయకులకు సూచించారు. జాతి కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళిద్దరితో పోల్చితే తాను సామాన్యుడినే అని చెప్పారు. ఇక ఆర్యవైశ్యులు సమాజ స్థితిగతులకు అనుగుణంగా ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు రోశయ్య అన్నారు.