: తప్పుడు కేసులు పెట్టి వేధించారు: చంద్రబాబు
టీడీపీ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలు, అభిమానులను ఎప్పుడూ టీడీపీ మరచిపోదని తెలిపారు. ఈ సాయంత్రం చంద్రబాబు సమక్షంలో దావలూరి దొరబాబు (పెద్దాపురం), తిప్పేస్వామి (అనంతపురం), శంకర్ యాదవ్ (తంబళ్లపల్లి), కుతూహలమ్మ(గంగాధర నెల్లూరు) టీడీపీలో చేరారు.