: ఎన్సీపీలో చేరిన శివసేన అధికార ప్రతినిధి


వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీల నుంచి వలసలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శివసేన పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ నార్వేకర్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరారు. నిన్ననే (ఆదివారం) ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ను ఆయన కలిశారు. ఆ రాష్ట్ర శాసన మండలి ఎన్నికల నుంచి తన అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవాలని పార్టీ హైకమాండ్ కోరడంతో నార్వేకర్ అసంతృప్తి చెందారని సమాచారం. ఆ కారణంతోనే పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఎన్సీపీ టిక్కెట్ పై మావల్ నియోజకవర్గం నుంచి నార్వేకర్ పోటీ చేస్తున్నట్లు వినికిడి.

  • Loading...

More Telugu News