: వరంగల్ మున్సిపాలిటీ భేష్: అమీర్ ఖాన్


దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ‘సత్యమేవ జయతే’ టెలీ షోలో అమీర్ ఖాన్ ప్రస్తావిస్తున్నారు. ప్రజలకు సామాజిక అంశాలపై కూడా ఆయన ఈ షో ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం ప్రసారమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో చెత్తా చెదారాన్ని శుభ్రం చేయడం, మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్య విధానాలను, నిధుల దుర్వినియోగం తదితర అంశాలను అమీర్ ప్రస్తావించారు. డంపింగ్ యార్డుల్లో చెత్తను కాల్చడం వల్ల వచ్చే చర్మ సమస్యలపై ఆయన పలువురు నిపుణులతో మాట్లాడించారు.

‘సత్యమేవ జయతే’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని వరంగల్ మున్సిపాలిటీ సాధించిన విజయాన్ని దేశప్రజల దృష్టికి తీసుకువచ్చారు. ఏడు రోజుల్లో వరంగల్ నగరాన్ని శుభ్రపరచడమే కాకుండా చెత్తను రీసైక్లింగ్ చేస్తూ... మున్సిపాలిటీకి రెవెన్యూ తెచ్చిపెట్టేలా కృషి చేసిన మున్సిపల్ అధికారి జనార్థన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ చేసిన సేవలను అమీర్ ప్రశంసించారు. వరంగల్లును క్లీన్ సిటీగా మార్చిన ఆ ఇద్దరు అధికారులపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.

  • Loading...

More Telugu News