: సినిమా నచ్చితేనే డబ్బులివ్వండి: కన్నడ దర్శకుడు
'సినిమా నచ్చితేనే డబ్బులివ్వండి' అంటూ ఓ కన్నడ దర్శకుడు సరికొత్త విధానానికి నాంది పలుకుతున్నారు. కన్నడ నాట 'లూసియా' సినిమాతో తారాపథంలోకి దూసుకుపోయిన పవన్ కుమార్ సినిమా నచ్చితేనే డబ్బులు ఇవ్వాలని, లేకుంటే సినిమా చూడవద్దని అంటున్నాడు. దానికి కొత్త పద్ధతి సూచిస్తున్నాడు. సినిమా తీసిన పద్దతిని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశానని, తొలుత దాన్ని చూడమని చెబుతున్నాడు.
అది ప్రేక్షకులను ఆకట్టుకుంటే అప్పుడు సినిమాకు వస్తారని అంటున్నాడు. తాను లూసియా సినిమా మేకింగ్ ను డాక్యుమెంటరీగా తీశానని అది చూడొచ్చని ఆ తరువాతే తన సినిమా చూడాలని చెబుతున్నాడు. లూసియా సినిమాని హిందీలో రీమేక్ చేసే సన్నాహాల్లో ఉన్నాడు. ఈ సినిమా సిద్ధార్థ్ హీరోగా తమిళంలో రీమేక్ అవుతోంది.