: కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే బస్సు యాత్ర: రఘువీరారెడ్డి
పురపాలక, సాధారణ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా బస్సు యాత్ర చేపట్టాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానిపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. యాత్రకు సంబంధించి షెడ్యూల్ రేపు విడుదల చేయనున్నట్లు తెలిపారు.