: సంగా బాటలో జయవర్థనే


శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం మహేల జయవర్థనే అంతర్జాతీయ టీ20లకు స్వస్తి పలకనున్నాడు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ముగిశాక జయవర్థనే పొట్టి ఫార్మాట్ నుంచి సెలవు తీసుకుంటాడని ఐసీసీ ట్విట్టర్లో పేర్కొంది. కుమార సంగక్కర పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలగనున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల జయవర్థనే వరుసగా ఐదు టీ20 ప్రపంచకప్ లలో శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటి వరకు 49 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడిన జయవర్థనే ఒక సెంచరీ, ఎనిమిది అర్థసెంచరీలతో 31.78 సగటు, 134 స్ట్రైక్ రేటుతో 1335 పరుగులు సాధించాడు.

  • Loading...

More Telugu News