: బస్సు యాత్ర చేపట్టాలని ఏపీ కాంగ్రెస్ నేతల నిర్ణయం
బస్సు యాత్ర చేపట్టాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ నివాసంలో భేటీ అయిన ఏపీ కాంగ్రెస్ నేతలు చర్చించారు. దాంతో, మరో మూడు నాలుగు రోజుల్లో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. శ్రీకాకుళంలో యాత్రను ప్రారంభించి అనంతపురంలో ముగిస్తారు. రోజుకు రెండు జిల్లాల్లో యాత్ర చేస్తారు. ఈ యాత్రలో రఘువీరారెడ్డి, చిరంజీవి, ఆనం, బొత్స ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. పురపాలక, సాధారణ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయడమే యాత్ర లక్ష్యం.