: పాతబస్తీలో పోలింగ్ ఆఫీసర్ గా బాలుడు.. విచారణకు ఆదేశం


పాతబస్తీలో ఎన్నికల తీరును తెలియజేసే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానంలో 14 ఏళ్ల మొహమ్మద్ షేక్ యూసుఫ్ అనే బాలుడు బూత్ స్థాయి పోలింగ్ అధికారి(బీఎల్ వో) గా నియమితుడయ్యాడు. దీనిపై ఒక వ్యక్తి ఎన్నికల సంఘానికి(ఈసీ) ఫిర్యాదు చేశారు. చాలా మంది బీఎల్ వోలు ఒక పార్టీకి సంబంధించిన వారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ విచారణకు ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని 1405 బీఎల్ వో నియామకాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానానికి అక్బరుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News