: తెలుగుభాషను ప్రేమించండి... పొరుగుభాషను గౌరవించండి: సుప్రీం న్యాయమూర్తి
తెలుగు భాషను ప్రేమించండి, కానీ పొరుగుభాషలను గౌరవించాలని తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ సూచించారు. ఆల్ ఇండియా తెలుగు ఫౌండేషన్ (ఏఐటీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం నాడు చెన్నైలో తొలిసారిగా తెలుగు సంఘాలన్నీ ఏకమై త్రిసంగ మహోత్సవం-2014 జరిపారు. జయనామ సంవత్సరం ఉగాది పండుగతో బాటు, స్వాతంత్ర్య సమరయోధులు వీరపాండి కట్టబ్రహ్మన్న, సుపరిపాలనకు ఉదాహరణగా నిలిచిన మహారాజు తిరుమలై నాయకర్ ల సంస్మరణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఏఐటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ త్రిసంగ మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య దంపతులు ప్రారంభించారు.