: మంగళవారం నుంచి రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన
ఈ నెల 18వ తేదీ, మంగళవారం నాడు రాష్ట్రానికి కేంద్ర బృందం రానుంది. లెహర్, హెలెన్ తుపానుల నష్టాన్ని అంచనా వేసేందుకు 8 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రంలో పంట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించనుంది. 19, 20వ తేదీల్లో తుపానుల ధాటికి పంటనష్టం వాటిల్లిన ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలను ఈ బృందం పరిశీలించనుంది.