: రోడ్డు షో మధ్యలోనే వెనుదిరిగిన జగన్ మోహన్ రెడ్డి
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఈ రోజు ఉదయం వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన రోడ్డు షోను అర్ధాంతరంగా ముగించారు. రోడ్డు షోను ప్రారంభించి పలువార్డుల్లో మాట్లాడిన అనంతరం ఆయన ఇరగవరం కాలనీలో స్థానికులతో మాట్లాడారు. అయితే మరో ఐదు వార్డుల్లో పర్యటించాల్సి ఉండగా అర్ధాంతరంగా ముగించి, తన వాహనంలో వెళ్ళిపోయారు. రూట్ మ్యాప్ గందరగోళంగా ఉండటం, జనస్పందన ఎక్కువగా లేకపోవడంతోనే అసహనానికి గురై అక్కడినుంచి వెనుదిరిగినట్టు సమాచారం.