: పవన్ పై సెటైర్లు విసిరిన వీహెచ్
కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తామని ఓ వ్యక్తి అంటున్నాడని... కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్ అంటున్నాడని... అది ఆయన వల్లే కాదు, ఆయన తాత వల్ల కూడా కాదని పవన్ ను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. సినిమా డైలాగులు తాము కూడా కొడతామని... కాకపోతే సినిమా అవకాశాలు తమకు ఎవరూ ఇవ్వరని అన్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం కేసీఆర్ కు ఇష్టం లేదనే విషయం తనకు ముందే తెలుసని తెలిపారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం తమకు కూడా ఇష్టం లేదని చెప్పారు. కాంగ్రెస్ లో విలీనం లేదని కేసీఆర్ చెప్పినప్పుడే పొత్తులు కూడా ఉండవనే విషయం తమకు అర్థమయిందని తెలిపారు.