: లుంబినీ పార్క్ కు వెళుతున్నారా.. జాగ్రత్త!
హైదరాబాద్ నగరంలో వరుసగా పేలుళ్లు జరుగుతున్నా స్థానికంగా భద్రతా ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. 2007లో లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్లు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది జరిగిన తర్వాత అయినా లుంబినీ పార్క్ సిబ్బందిలో నిర్లక్ష్యం వీడలేదని పోలీసుల తనిఖీలో స్పష్టం అయింది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ప్రైవేట్ భద్రతా సంస్థల ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా డమ్మీ బాంబులతో లుంబినీ పార్కులోకి వెళుతున్న పోలీసులను (మఫ్టీలో) పార్క్ భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయారు. మెటల్ డిటెక్టర్లు పనిచేయడం లేదని అధికారుల తనిఖీలో తేలింది. దీంతో పార్క్ సిబ్బందిపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి నోటీసులు జారీ చేయనున్నారు.