: మోసం, వంచనకు మారుపేరు టీఆర్ఎస్: దామోదర రాజనరసింహ
టీఆర్ఎస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహ అన్నారు. హైదరాబాదులో ఈరోజు (ఆదివారం) ఆయన మీడియాతో మాట్లాడారు. దగా, మోసం, వంచనకు మారుపేరు టీఆర్ఎస్ అని ఆయన తీవ్రవిమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం తమకుందని రాజనరసింహ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడినది కాంగ్రెస్, సోనియాగాంధీయేనని ఆయన స్పష్టం చేశారు.