: మోడీ, రాజ్ నాథ్ ల చెప్పు చేతుల్లో బీజేపీ: వాజ్ పేయి మేనకోడలు
బీజేపీలో వాజ్ పేయి, అద్వానీల శకం ముగిసిందని వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా అన్నారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్ లాంటి కొంత మంది చెప్పు చేతుల్లో బీజేపీ ఉందని తెలిపారు. వార్డు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సేవ చేసిన తనను బీజేపీ సీనియర్ నేతలు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తనను పలుమార్లు అవమాన పరచారని విమర్శించారు. అందుకే తాను బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని కరుణా శుక్లా తెలిపారు.